నేటి తరానికి కాళోజీ పోరాటపటిమ స్ఫూర్తి – మాజీ ఎంపీ నామ
…..
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;
తెలంగాణ సంస్కృతి, సాహిత్య చరిత్రలో చిరస్మరణీయమైన కవి, రచయిత, ఉద్యమకారుడు, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్థంతి సందర్భంగా బిఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఆయన సేవలను స్మరించుకుంటూ పత్రిక ప్రకటన విడుదల చేసారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని భావితరాలకు పోరాట స్ఫూర్తిని నింపారని, తెలంగాణ ప్రజల మనసు గెలుచుకున్న మహామనిషి కాళోజీ అని, జీవితమంతా ప్రజా సంక్షేమానికే అంకితమయి, నిరంతరం తెలంగాణ సాధన కోసం తపించారన్నారు. ఆయన రచనల ద్వారా మనకు అందించిన సందేశం అనితర సాధ్యమని, ఆయన జీవితమంతా స్ఫూర్తి కలిగించేదన్నారు. కాళోజీ ప్రజల బాధలను అక్షరాల్లో ప్రతిబింబించి సామాజిక స్పృహకు నాంది పలికారని, కాళోజీ కవిత్వం, ఉద్యమ స్ఫూర్తి నేటితరం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని నామ నాగేశ్వర రావు తెలిపారు. ఆయన రచనలు సామాన్య జనానికి ఆశ్రయంగా, ఉద్యమకారులకు ధైర్యంగా నిలిచాయన్నారు. ఆయన చూపించిన ప్రజాస్వామ్య విలువలు, సమానత్వ దృక్పథం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయి అని కొనియాడారు. తెలంగాణ భాష, సంస్కృతి, ఆచారాలు కాళోజీ కలంలో వెలుగొందాయిని, ప్రజాస్వామ్య లక్ష్యాల సాధన కోసం ఆయన చేసిన తపన అనిర్వచనీయమైంది. ఆయన కవిత్వం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కాళోజీదే అని నామ నాగేశ్వర రావు పేర్కొన్నారు. కాళోజీ రచనలు భావి తరాలకు స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన సత్యం, ధైర్యం, సమానత్వం పట్ల ప్రేమ ఇవన్నీ తెలంగాణ భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటాయన్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రం లోని వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టారని, వరంగల్లో కాళోజీ కళాకేంద్రాన్ని నిర్మించినట్లు ఈ సందర్భంగా నామ గుర్తు చేశారు.