కార్తీక మాస వనభోజనాల మహోత్సవంలో మాజీ మంత్రి నారాయణ
- కాప్స్ రాక్స్ బలిజ ఆధ్వర్యంలో అట్టహాసంగా కార్తీక మాస వనభోజనాలు
నెల్లూరు కస్తూరిభాకళాక్షేత్రంలో కాప్స్ రాక్స్ బలిజ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు అట్టహాసంగా ఏర్పాటు చేశారు. కాప్స్ రాక్స్ బలిజ వారి ఆహ్వానం మేరకు కార్తీకమాస వనభోజనాలు కార్యక్రమాలకు హాజరైన మాజీ మంత్రి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులకు పూర్ణకుంభం చేతపట్టి వేదమంత్రాలతో అర్చకులు ఘనస్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన వ్రతం కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కస్తూరిభాకళాక్షేత్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగానికి వారు భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేశారు. తదనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి కళాకారులను, చిన్నారులను వారు అభినందించారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులను గజమాలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తదనంతరం అందరితో కలిసి వారు వనభోజనాలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ కాప్స్ రాక్స్ బలిజ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కాప్స్ రాక్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవకార్యక్రమాలను ఆయన అభినందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించి సేవ చేస్తున్న కాప్స్ రాక్స్ పౌండేషన్ మరింత ఉన్నత స్థితికి చేరాలన్నారు. ఇందుకు తమవంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. నెల్లూరు నగర పరిధిలో 3 ఎకరాల 40 సెంట్లలో కాపుభవనానికి స్థలం కేటాయించడం టీడీపీ ప్రభుత్వహయాంలోనే జరిగిందన్నారు. అక్కడ కాపుభవనంతో పాటు నిరుపేదలకు వసతిభవనం కోసం డిజైన్ కూడా చేపట్టి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. రానున్న 2024లో ప్రజలందరి ఆశీస్సులతో తాము విజయం సాధించాక నెల్లూరులో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో ప్రజలందరు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మామిడాల మధు , కాప్స్ రాక్స్ బలిజ నాయకులు పసుమర్తి కిషోర్, కోలపల్లి అశోక్ కుమార్, గునుకుల కిషోర్, దొరబాబు, చెక్క సాయి సునీల్, పోతురాజు అనిల్ తదితరులు పాల్గొన్నారు.