కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్

SAKSHITHA NEWS

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్ –

రోడ్డుపై మాజీ సీఎం కేసీఆర్ కారును నడిపారు. అదేంటి బీఆర్ఎస్ అధినేత కారు నడపడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు! స్వయంగా కేసీఆర్నే తన పాత ఓమ్నీ కారును కాలు శస్త్ర చికిత్స తర్వాత నడిపారు. ఇది కూడా డాక్టర్లు కారు డ్రైవ్ చేయమని ఇచ్చిన సలహాతో.
పైన ఉన్న చిత్రం చూస్తే మీకు ఏదో డౌట్ వచ్చే ఉంటుందే. అదే కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాజీ సీఎం కేసీఆర్ అని? అసలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏంటి? కారు నడపడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఎప్పుడూ సభలు, సమావేశాలు అంటూ రాజకీయాల్లో బిజీబిజీగా ఉండి ప్రత్యర్థులపై విరుచుకుపడే కేసీఆర్నే చూశాం. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఎప్పుడూ చూడని సన్నివేశం చూస్తున్నాం. అదే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడపడం. ఓమ్నీ వ్యాన్ స్టీరింగ్ను తన చేతుల్లోకి తీసుకుని కేసీఆర్నే స్వయంగా డ్రైవింగ్ చేశారు. కాలు ఆపరేషన్ తర్వాత కర్ర సహాయంతో కాకుండా మ్యానువల్ కారు నడిపి చూడాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో మాజీ సీఎం ఇలా తన పాత కారు ఓమ్నీ కారును నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్

SAKSHITHA NEWS