సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు సార్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పని చేశారని, ఎనలేని సేవలు అందించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ములాయం మృతి తో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…