తిరుమల : శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల డిప్ కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకూ నమోదు చేసుకోవచ్చు. అదే రోజు లక్కీడిప్ టికెట్లు పొందిన భక్తులు మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
● ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మే నెల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
● 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జారీ చేస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు.
● 24న ఉదయం 10 గంటలకు మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ విడుదల చేస్తారు.
● మే నెలకు సంబంధించి ఈ నెల 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు.https://ttdevasthanams.ap.gov.in
వెబ్‌సైట్‌లో సేవా టికెట్లు బుక్ చేసుకోవాలని తితిదే కోరింది.
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం
Related Posts
విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ !
SAKSHITHA NEWS విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ ! విడదల రజనీ మంత్రి పదవిని అడ్డం పట్టుకుని పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారుల్ని బెదిరించి డబ్బులు దండుకున్న పాపాలు పండిపోయాయి. అధికారం పోవడంతో డబ్బులు ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ కు శుభవార్త అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ కార్యకలాపాలు సీఎం చంద్రబాబు తో గూగుల్ ప్రతినిధుల భేటీ గూగుల్ తో ఎంఓయూ చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం SAKSHITHA NEWS