చిరు వ్యాపారులకు అండగా నేడు – వడ్డీ లేని రుణాలతో జగనన్న తోడు.”
-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మాత్యులు * జోగి రమేష్ .*
సాక్షిత : తమకు తాముగా ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందిస్తూ వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక అవస్థలు పడుతున్న చిరు వ్యాపారులు మరియు సాంప్రదాయ చేతి వృత్తుల వారికి అండగా నిలుస్తూ వారి ఉపాధికి ప్రభుత్వం తరఫున ఆర్థిక చేయూత అందిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా వారి ఖాతాల్లోకి బటన్ నొక్కి పదివేల రూపాయలు జమ చేసిన సందర్భంగా మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గ చిరు వ్యాపారులు తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ , పెడన నియోజకవర్గంలోని అర్హులైన చిరు వ్యాపారులు మరియు సంప్రదాయ చేతి వృత్తులు వారు నేడు జగన్ తోడు పధకం ద్వారా నాలుగో విడత లబ్ధి పొందనున్న వారి సంఖ్య వెల్లడించారు.
బంటుమిల్లి మండలంలో 70 మంది, గూడూరు మండలంలో 179 మంది, కృత్తివెన్ను మండలంలో 67 మంది, పెడన గ్రామీణ మండలంలో 122 మంది మరియు పెడన మున్సిపాలిటీ పరిధిలోని 642 మందితో కలిపి మొత్తం 1,080 మంది చిరు వ్యాపారులు జగనన్న తోడు పథకంతో 1 కోటి 8 లక్షల రూపాయలు ఆర్ధిక చేయూతగా అందుకున్నారని *మంత్రి రమేష్ * వివరించారు.
వ్యాపార అవసరాలకు రుణాలు కావాల్సిన ఆపత్కాలంలో, అవి దొరకక పోవడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని చిరు వ్యాపారాలు చేస్తూ అదనపు భారం మోస్తున్న వీధి వ్యాపారాలు చేసుకునే వారిని చూసి, వారు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి జగన్ తన పాదయాత్ర సమయంలో కదిలిపోయారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి ఆర్థిక చేయూత అందిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం జగన్ ఏటా క్రమం తప్పకుండా వారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందిస్తున్నారు.
నేడు జగనన్న తోడు పధకం ద్వారా తమకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ అధిక వడ్డీలు బాధల నుంచి విముక్తి కల్పించి, తమకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న ఈ పథకం పట్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి మరియు నియోజకవర్గంలో తమను గుర్తించి నేడు తమ ఖాతాల్లోకి 10 వేల రూపాయలు జమ చేయడానికి సహకరించిన రాష్ట్ర మంత్రి జోగి రమేష్ కి పెడన పట్టణ పరిధిలోని లబ్ధిదారులైన చిరువ్యాపారులు కృతజ్ఞతలు తెలుపుతూ పెడన పట్టణ పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి జై జగన్ జై జోగి అంటూ నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.