చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.
సాక్షిత ప్రతినిధి చిలుకూరు సూర్యపేట జిల్లా, :సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం చిలుకూరు గ్రామంలోని నేషనల్ హైవే 167 కోదాడ టు హుజూర్నగర్ రోడ్డు లో కటకమ్మ గూడెం కాలవడ్డులో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం మొదటి నాగుల చవితి సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఉదయం 3 గంటల నుండి పుట్టలకు పాలు పోసి నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి అన్నదాన కార్యక్రమం నిర్వహణలో భాగంగా సంక్రాంతి శ్రీనివాసరావు జ్ఞాపకార్థం కుమార్తె శ్రీలత, కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ,సంక్రాంతి ఫౌండేషన్ ద్వారా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. కోరిన కోరికలూ తీర్చే శ్రీ అభయాంజనేయ స్వామి కార్తీక మాసంలో పూజ చేసే ప్రతి భక్తుడు యొక్క కోరిక తీర్చాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ సంక్రాంతి లక్ష్మీనారాయణ,సంక్రాంతి లక్ష్మయ్య, కరుణాకర్, రాజశేఖర్, విజయ శేఖర్ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
చిలుకూరు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం.
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…