SAKSHITHA NEWS

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

విద్యార్థి దశ చాలా కీలకం

ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం విద్యార్థులకు దిశా నిర్దేశం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై సాయి రామ్ సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సాయంత్రం సూర్యాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాలను సరిగా పాటించకపోవడం వల్లే తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. విద్యార్థి దశ చాలా కీలకమని ఆదశలోనే విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని ఉన్నత స్థాయిలకు ఎదిగినప్పుడే అందరూ గౌరవిస్తారని ఆ దిసాగా అడుగులు వేయాలని సూచించారు.. తల్లిదండ్రులకు, చదివిన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మరియు అదేవిధంగా వాహన చోదుకులు డ్రైవింగ్‌ చేసేటప్పుడు సెల్‌ఫోన్లలో మాట్లాడకుండా డ్రైవింగ్‌ చేయాలని సూచించారు. చలికాలంలో మంచు అధికం కారణంగా ఓవర్‌టేక్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జీవి. విద్య సాగర్, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, చంప్ల్లా , పి ఈ టి రేహమతుల్ల, హెల్త్ సూపర్వైజర్ జానీ పాషా మరియు విద్యార్థులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS