Focus on Smart City structures: Collector Praveen Kumar
స్మార్ట్ సిటి నిర్మాణాలపై దృష్టి సారించండి : కలెక్టర్ ప్రవీణ్ కుమార్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
*సాక్షిత : *తిరుపతి స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో నిర్మాణంలో వున్న ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మెన్, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ డైరెక్టర్ల 34వ సమావేశం తిరుపతి స్మార్ట్ సిటి చైర్మెన్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరగగా, తిరుపతి స్మార్ట్ సిటీ ఎం.డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ ప్రాజెక్టుల వివరాలు తెలియజేయగా, స్మార్ట్ సిటీ బోర్డు డైరెక్టరులు అయిన డిల్లి నుండి సెంట్రల్ అండర్ సెక్రటరి రవిచంద్ర, తిరుపతి జిల్లా పోలిస్ ఎస్పి హర్షవర్దన్ రాజు, తుడా వైస్ చైర్మెన్ వెంకట నారాయణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొనగా, ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా వున్న రామచంధ్రారెడ్డి, రమాశ్రీ పాల్గొనగా నిర్మాణంలో వున్న ప్రాజెక్టులపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఐ ట్రీపుల్ సి నిర్మాణాలపై, సిటీ ఆఫరేషన్ సెంటర్ నిర్మాణాలు, మల్టి లెవల్ పార్కింగ్ నిర్మాణాలపై చర్చిస్తూ పనులు పూర్తి కోసం ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వం నుండి రావల్సిన నిధులపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని తీర్మానించడం జరిగింది. ఈ సమావేశంలో తిరుపతి స్మార్ట్ సిటి జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, స్మార్ట్ సిటీ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.