పదవి విరమణ పొందిన ఫ్లెమింగ్ కార్మికుడిని సన్మానించిన ఎమ్మెల్యే
నవాబ్ పేటలోని ఫ్లెమింగ్ లాబొరేటరీస్ లిమిటెడ్ లో గత 18 ఏళ్లుగా పనిచేసి పదవి విరమణ పొందిన సీ.గోవింద, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి, తోటి కార్మికులు అందిస్తున్న ఒకరోజు వేతనాన్ని చెక్కు రూపంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా సీ.గోవిందకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లెమింగ్ లాబొరేటరీస్ లిమిటెడ్ కార్మికులు పాల్గొన్నారు.