SAKSHITHA NEWS

కాలిఫోర్నియాలో కూలిన విమానం.. ఐదుగురు మృతి

దక్షిణ కాలిఫోర్నియాలో విషాదం చోటు చేసుకుంది. కాటాలినా ద్వీపంలో ఓ విమానం కూలిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ట్విన్-ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ 95 అనే విమానం రాత్రి 8 గంటల సమయంలో అవలోన్ ద్వీప పట్టణానికి సమీపంలో ఉన్న కాటాలినా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. అనంతరం కాసేపటికే క్రాష్ అయింది. విమానాశ్రయానికి పశ్చిమాన రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్టు వెల్లడించింది.


SAKSHITHA NEWS