దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు (2024) తొలి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 గడువు. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 19న ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది.
ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అస్సాంలలోని ఐదేసి, బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి…
సార్వత్రిక ఎన్నికలకు (2024) తొలి నోటిఫికేషన్
Related Posts
ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు
SAKSHITHA NEWS ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు..! RBI కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్‌ను తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో మందం ఎక్కువగా ఉన్న ఒక్క పాత 5 రూపాయాల కాయిన్‌ను కరిగిస్తే 4 నుంచి…
లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
SAKSHITHA NEWS లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు? న్యూ ఢిల్లీ :లోక్ సభ తో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ,(129) సవరణ బిల్లును ఈరోజు లోక్…