అసత్య ప్రచారంపై ఫైర్.. జాతీయ మీడియా సంస్థ వివరణ!

SAKSHITHA NEWS

Fire on false propaganda.. Explanation of the national media organization!

టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరున నకిలీ ఎగ్జిట్ పోల్‌ని తయారు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని హిందుస్తాన్ టైమ్స్‌కి చెందిన లాజికల్ ఫాక్ట్స్ విభాగం పరిశోధన చేసి బయటపెట్టింది.

ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్‌ పేరున సోషల్ మీడియాలో వైరల్‌గా తిరుగుతున్న స్క్రీన్‌షాట్ పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది.

మే 13, 2024న ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయని దీని ప్రకారం టీడీపీ గెలుస్తుందని ఐ-టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు వారి సోషల్ మీడీయా ఛానల్స్‌లో ప్రచారం చేసినట్టు తాము గుర్తించామని తెలిపింది.

అయితే, ఈ స్క్రీన్ షాట్ పూర్తిగా కల్పితం. 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో టైమ్స్ నౌ ప్రచురించిన ఎగ్జిట్ పోల్‌ను మార్ఫ్ చేసి స్క్రీన్‌షాట్ తీసి ఆంధ్రప్రదేశ్‌దిగా ఉద్దేశపూర్వకంగా మార్చబడిందని స్పష్టం చేశారు.

తాము నిజనిజాలు తెలుసుకోవడానికి టైమ్స్ నౌ కు చెందిన సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్‌లను పరిశోధించాం కానీ 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచురించబడిన డేటా ఎక్కడా కనుగొనబడలేదని తేల్చి చెప్పింది.

2021లో ఉత్తరప్రదేశ్ ఒపీనియన్ పోల్‌ను ప్రచురించేటప్పుడు టైమ్స్ నౌ ఇదే విధమైన టెంప్లేట్‌ను ఉపయోగించినట్లు తెలిపింది. తాము చేసిన రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెల్లడైందన్నారు.

నవంబర్ 16, 2021న టైమ్స్ నౌ ప్రచురించిన ఈ ఒపీనియన్ పోల్‌లోని స్లైడ్ తారుమారు చేసినట్లు తమ పరిశోధనలో వెల్లడైంది.

నిజానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన అంచనాలు ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం జూన్ 1న మాత్రమే విడుదల చేయబడతాయని స్పష్టం చేసింది.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page