వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల పర్యటన లో తుఫాన్ భాదితులకు ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వేగేశన నరేంద్ర వర్మ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కలసి 47కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందజేశారు.
ఈ సందర్బంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ…..
మీచౌంగ్ తుఫాన్ బారిన పడి నిరాశ్రయులైన బాపట్ల పట్టణం 3వ వార్డ్ రాజీవ్ నగర్ కాలనికి సంబందిచిన 47 యానాదుల కుటుంబాలకి చంద్రబాబు నాయుడు 5000 రూపాయిల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిన వెంటనే ఆయన ఆర్ధిక సహాయంను ఆయన అందజేసారు
తుఫాన్ వలన రాష్ట్రము చాల నష్ట పోయింది అని ఈ విపత్తుని వెంటనే జాతీయ విపత్తుగా పరిగణించి తుఫాన్ బాధితులని ఆదుకోవాలి అని ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు బాబు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ ను రాసారు అన్నారు
బాపట్ల జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాలు వర్షం వస్తే జలాశయాలుగా మారుతున్నాయని , ఆ జలాశయాలలోనే వారు జీవనం సాగిస్తున్నారు అని, వారికీ ఏదోకటి చేయాలి అని చంద్రబాబు బాబు తో చెప్పడం జరిగిందని అయన అన్నారు
చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి మరునాడు ఉదయం ఆ ప్రాంతాన్ని సందర్శించి ఈ ప్రాంతం చాల ఘోరంగ వుందని జిల్లా కేంద్రంలోనే దుస్థితి ఇలా ఉండడం చాల బాధగా వుంది అని వారు అన్నారని తెలిపారు
2024 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి రాగానే పూర్ టు రిచ్ ఫథకాని పైలట్ ప్రాజెక్ట్ గ ఇక్కడ నుండే మొదలు పెడదాం అని, వీరి అందరికి పక్క ఇల్లు కట్టించి రోడ్లు కూడా వేసి వారికి నివేసన పట్టాలను ఇద్దామని నారా చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు