ఫీజు బకాయి – బీజేపీ లడాయి
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో కొనసాగుతున్న “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” కార్యక్రమంలో భాగంగా శ్రీ చైతన్య కాలేజ్ మరియు శ్రీ విద్య డిగ్రీ & ఇంటర్ కాలేజ్లో విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నాము.
ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, స్కాలర్‌షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాము. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశాము.
విద్యార్థుల హక్కుల కోసం, వారి భవిష్యత్తు కోసం BJYM నిరంతరం పోరాటం కొనసాగిస్తుంది.
ఈ కార్యక్రమంలో BJYM రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్ , BJYM రాష్ట్ర మీడియా కన్వీనర్ నాగదీప్ గౌడ్ , రావుల పృథ్వీ , శ్యామ్ కిరణ్ రెడ్డి , శ్రీనాథ్ , మంజునాథ్ పాల్గొని విద్యార్థులతో మమేకమయ్యారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
