“శ్రీ గాయత్రి స్కూల్” ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

Sakshitha news

“శ్రీ గాయత్రి స్కూల్” ను ప్రారంభించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

…..

సాక్షిత ::130 – సుభాష్ నగర్ డివిజన్ సుభాష్ నగర్ లో లక్ష్మీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ గాయత్రి స్కూల్ ను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో శ్రీ గాయత్రి స్కూల్ అత్యున్నతంగా పనిచేస్తుందని విశ్వసిస్తున్నానని అన్నారు. పిల్లల భవిష్యత్తు రూపకల్పనలో పాఠశాల యాజమాన్యం, టీచర్లతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నరేందర్ కృష్ణ, నవీన్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ,అడపా శేషు కుంటి మల్లేష్, దుబాయ్ శ్రీను, సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top