హైడ్రా పై రాజకీయాలు తగదు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్.
హైడ్రాధికారి రంగనాథ్ ని కమిషనర్ పదవి నుండి తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును నాణెం కు ఒకవైపు చూసి దాన్నే ఎత్తిచూపడం వల్ల గత ప్రభుత్వంలో జరిగిన కబ్జాలు ఎటుపోవని కాబట్టి హైకోర్ట్ తీర్పును రాజకీయం చేయవద్దని సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పత్రిక ప్రకటనను విడుదల చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు రక్షణ కొరకు ఏర్పడ్డ హైడ్రా కొద్ది రోజులలోనే అనేక మంచి మరియు ప్రజలకు నష్టం కలిగించే చర్యలు కూడా తీసుకున్నప్పటికీ వీటివల్ల ఎక్కువగా నష్టపోయింది కబ్జాదారులు మాత్రమేనని అన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఏ నియోజకవర్గంలో చూసిన కుంటలు చెరువులు ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి ఏదో మధ్యతరగతి ప్రజలను మోసం చేశారని ఆ విషయాన్ని హైడ్రా వచ్చాక అనేక కూల్చివేతల వల్ల కబ్జాదారులకు నష్టం వాటిల్లడం వల్లనే కోర్టులకు పోయి అబద్ధపు సమాచారాన్ని ఇచ్చి వారి కబ్జాలను కాపాడుకుంటున్నారని అంతేకానీ పేద ప్రజలు హైడ్రాకి వ్యతిరేకంగా కోర్టుకు పోయిన సందర్భాలు చాలా తక్కువ అని కాబట్టి హైడ్రా లేక హైడ్రాధికారి రంగనాథ్ చర్యలు కబ్జాదారులకు నష్టమని అన్నారు. సిపిఐ గా కూడా హైడ్రా పై భిన్నభిప్రాయాలు ఉన్నప్పటికీ చెరువులు కుంటలు అభివృద్ధి విషయంలో హైడ్రాకు మద్దతిస్తూనే, పరికి చెరువు లో జరిగిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో హైడ్రా రంగనాథ్ గారు విఫలమయ్యారని ఇటువంటి విషయంలో హైడ్రాను తప్పుపట్టుతున్నామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో పక్షపాత,సొంత రాజకీయ నాయకుల అభిప్రాయాలను పరిగనణలోకి తీసుకోని హైడ్రా ను సొంత సంస్థ లాగా ఉపయోగించుకోవడం వల్లే నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కారణమని కావున రేవంత్ రెడ్డి గారు నిష్పాక్షపాతంగా వ్యవహరించి గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన భూములను కాపాడాలని డిమాండ్ చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
