SAKSHITHA NEWS

దేవాడ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం.

సాక్షిత:- పరవాడ జీవీఎంసీ పెదగంట్యాడ మండలం 77వ వార్డు పరిధిలో గల కేఎస్ పాలెం మరియు దేవాడ గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కే.ఎన్ పాలెం గ్రామంలో గల ఇందల కోలనీ మరియు దేవాడ గ్రామాలలో వ్యవసాయ పంట పొలాలను సందర్శించి గ్రామంలో ఉండే రైతులతో వ్యవసాయాధికారిణి శశికళ, దేవాడ పశు వైద్యాధికారి సురేష్ మరియు ఇతర గ్రామ నాయకులు, రైతులతో పాటు పరిశీలించి, చీడపీడలను, పోషక లోపాలను గమనించి తదనుగుణంగా సూచనలు చేయడమైనది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వ్యవసాయ మరియు అనుబంధ శాఖలలోని వివిధ పథకాల గురించి వివరించారు.

ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి రైతు పొలంలో వేసిన పంటలను ఈ-పంట ద్వారా నమోదు పూర్తి చేసి, ఆయా రైతులకు ఈకేవైసీ చేయడం ద్వారా ఉచిత పంటల భీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ప్రభుత్వం రాయితీపై అందించబోయే డ్రోన్ లను అర్హులైన రైతులు తీసుకొని ఎరువులు మరియు పురుగు మందులు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పిచికారి చేయడం ద్వారా పంట పెట్టుబడులు తగ్గించుకోవడంతో పాటు, మెరుగైన దిగుబడులు పొందవచ్చునని తెలియపరిచారు. పశుసంవర్ధక శాఖ ద్వారా పాడిపశువులకు షెడ్లు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం ద్వారా 90% రాయితీ అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె.ఎన్ పాలెం సచివాలయ సంక్షేమ కార్యదర్శి చిరికి పెద్దినాయుడు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో నీటి నిల్వ కుంటలు, పంట పొలాలకు చీడ పీడలు నివారణ కొరకు స్ప్రేయింగ్ యంత్రాలను సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తుంది కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించుటకు సులభం అవుతుంది అని రైతులు కు తెలియజేశారు.


SAKSHITHA NEWS