భీమవరం:
ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్లో పెట్టిన ఆయన.. విశ్రాంతి లేకుండా వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. వారాహి యాత్రలో భాగంగా ప్రస్తుతం గోదావరి జిల్లా పర్యటనలో ఉండటంతో నిర్మాతలు షూటింగ్స్ కూడా అక్కడే ప్లాన్ చేశారు. దీంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా, నిమిషం రెస్ట్ తీసుకోకుండా షూటింగ్స్, పాలిటిక్స్‌లో పాల్గొంటున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభ అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పెదఅమిరంలోని ఓ ఫంక్షన్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన భీమవరం నేతలతో భేటీ అనారోగ్య కారణంగా వాయిదా పడింది. ఈ విషయం తెలిసిన జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు….
పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…