ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి – జయంతి వేడుకల్లో కలెక్టర్
సాక్షిత, తిరుపతి బ్యూరో: నిరుపేద కుటుంబంలో పుట్టిన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని, ఆయనను స్మరించుకోవడం మన విధి అని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్, జెసి, జిల్లా యంత్రాంగం టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1872 ఆగష్టు 23 న జన్మించారని, తన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరి భోజనశాల నడిపినా తల్లి సంపాదన చాలక ధనికుల ఇళ్ళల్లో వారాలకు పనిచేసి, చిన్న వయసులోనే ప్రకాశం నాటకాలు వేసి చదువు సాగించి న్యాయవాదిగా ఎదిగి, స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నారన్నారు. పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మరణించటంతో ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్ 1 న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు నియమితుడయ్యారని , తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, విజయవాడ వద్ద కృష్ణా నది పై బారేజి నిర్మాణంలో తనవంతు కృషి చేసారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బాలాజీ, డీఆర్వో శ్రీనివాస రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి – జయంతి వేడుకల్లో కలెక్టర్
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…