SAKSHITHA NEWS

Expiring term of office of Vice-Chancellors

హైదరాబాద్:
రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవి ద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారం తో ముగియనుంది.

వీసీల నియామకాలకు ఎన్నికల కమిషన్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో కొత్త వీసీల నియామకానికై ప్రభు త్వం కసరత్తు ముమ్మరం చేసింది.

ఇప్పటికే , ఒక్క కాకతీయ విశ్వవిద్యాలయం తప్ప మిగతా 9 విశ్వవిద్యాల యాల ఉప కులపతుల నియామకాల కోసం సెర్చ్ కమిటీని ప్రభుత్వం నియమించింది.

గత ప్రభుత్వం సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇచ్చిందనీ, తమ ప్రభుత్వం మాత్రం సామాజిక న్యాయం నేపథ్యంగా నియామకాలు చేపడుతుందని..

ముఖ్య మంత్రి ఎ రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించి నందున ఆ దిశలోనే కొత్త వీసీల నియామకం కోసం చర్యలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు నియామక ప్ర క్రియ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

కాకతీయ యూనివర్సిటీ మినహా మిగతా ఉస్మా నియా , జేఎన్టీయూహెచ్‌, పాలమూరు, పొట్టి శ్రీరాము లు, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలకు వీసీల నియామకం చేపట్టాల్సి ఉంది.

కాకతీయ యూనివర్సిటీ వీసీ నియామకం కోసం ఇంకా సెర్చ్‌ కమిటీని నియమించలేదు..

WhatsApp Image 2024 05 21 at 11.16.13

SAKSHITHA NEWS