మాజీ మంత్రి పేట శాసనసభ్యులు ప్రత్తిపాటి బాటలో క్లస్టర్ ఇంచార్జ్ జంగా వినాయక రావు
చిలకలూరిపేట పట్టణం వైయస్సార్ కాలనీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాట్ల ప్రసాదరావు గత కొద్ది రోజులు క్రితం మరణించడం జరిగింది. ఆ వార్త తెలుసుకొని వారి నివాసానికి చేరుకొని చాట్ల ప్రసాదరావు చిత్రపటానికి పూలమాలవేసి కుటుంబానికి పెద్ద మరణిస్తే ఆ కుటుంబం ఎంతో దుఃఖంతో ఉంటుందో అని ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి 5000₹ రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఏ సహాయం కావాలన్నా ఒక తోడబుట్టిన వాడిలా నన్ను అడగండి అని ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇంచార్జ్ జంగా వినాయక రావు , టిడిపి కౌన్సిలర్ జంగా సుజాత, టిడిపి నాయకులు రంగా , మధు, వెంకట్రావు ,వార్డు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.