
ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి
జిల్లా ఓ బి సి మోర్చా అధ్యక్షులు వాగుల్దాస్ నిరంజన్ గౌడ్
నాగర్ కర్నూలు జిల్లా సాక్షితా ప్రతినిధి
నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలోని ఊరుకొండ పేట గ్రామంలో బి జె పి , బి జె వై ఎం ఆధ్వర్యంలో సన్న బియ్యం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వాగుల్ దాస్ నిరంజన్ గౌడ్ విచ్చేసి ఉర్కొండపేట నర్సంపల్లి గ్రామాలలో రేషన్ షాపులోనీ సందర్శించి ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ .భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ
గత ఐదు సంవత్సరాలుగా కష్టకాలంలో
క్లిష్ట పరిస్థితుల్లో కరోనా సమయంలో
కూడా పేదలను దృష్టిలో ఉంచుకొని ఉచిత రేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అని ప్రజలకు వివరించారు. కేంద్రం ఇచ్చే వాటా 40 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటా పది రూపాయలు అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేక
ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని చేపట్టారని. ఆయన అన్నారు, నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి గ్రామంలోని ప్రజలకు తెలుసు అని అన్నారు, మీరు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పిన వచ్చే స్థానిక ఎలక్షన్లో బిజెపిది ఘన విజయమని ఆయన స్పష్టం చేశారు.
నరేంద్ర మోడీ ఆలోచన ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలని కడుపు నిండాలని ఆయన ఆలోచనలో భాగంగానే ఉచిత రేషన్నీ ప్రవేశపెట్టారు .పేదవాని ఇంట్లో సన్న బియ్యం ఉండాలి.. పేదవాడి కడుపు నింపాలి ప్రతిరోజు పేదవాడికి పండగ కావాలీ అనేది బిజెపి ఆలోచన అని అన్నారు.
ఉచిత రేషన్ సన్న బియ్యం ఇస్తున్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి ఊరుకొండ పేట నర్సంపల్లి గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బి జె వై ఎం యువ నాయకులు. టీ అరవింద్ గౌడ్.తెలంగాణ బిజెపి యువ నాయకుడు దివాకర్ గౌడ్. బిజేపిమండల సీనియర్ నాయకులు తాడెం చిన్న.నాగర్ కర్నూల్ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి రాఘవేందర్ . బి జె వై ఎం నాయకుడు హరీష్ యాదవ్ బిజెపి , బి జె వై ఎం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
