SAKSHITHA NEWS
Estimated cost is around 63.00 lakh rupees

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీ లో షుమారు 63.00 లక్షల రూపాయల అంచనా వ్యయంలో భాగంగా, నిర్మిస్తున్న డ్రైనేజ్ పైప్ లైన్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీ రామ్ నగర్ కాలనీ లో డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది అని, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అదే విదంగా డ్రైనేజ్ పైప్ లైన్ పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు . ఈ కార్యక్రమంలో రాజుసాగర్, గాలయ్యా, శేకర్, కుమార్, కృష్ణ, ప్రవీణ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.