SAKSHITHA NEWS

5 లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు

నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత ప్రతినిధి

        సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో,

భక్తుల సౌకర్యార్థం రక్షిత త్రాగునీటికై
రూ.5,00,000/-(ఐదు లక్షలతో) మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ,
నాగర్ కర్నూలు జిల్లా
ఉర్కొండ మండలం ఉర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న,
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్&
టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి,
స్వామివారి దర్శనం అనంతరం,
దేవాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రక్షిత త్రాగునీటికోసమై దేవాలయకమిటీ కోరికమేరకు,
సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గఐక్యత ఫౌండేషన్ సహకారంతో… రూ.5,00,000/-(ఐదు లక్షలతో)(బోర్ మోటర్ తో సహా)మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఈరోజు భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది,
ఈ సందర్భంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ…
తన ఇష్టదైవం శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి స్వామి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని,అలాగే దేవాలయ కమిటీ విజ్ఞప్తిమేరకు భక్తుల సౌకర్యార్థం ఐక్యత ఫౌండేషన్ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందని,ఎంతో ప్రాముఖ్యత కలిగిన పబ్బతి ఆంజనేయస్వామి వారికి తన వంతు సేవ చేసుకొనే భాగ్యం దక్కడం సంతోషంగా ఉందని,
దేవాలయానికి సంబంధించి ఎలాంటి సహకారానికైన ముందుటామని తెలియజేశారు,

దేవాలయ కమిటీ చైర్మన్ మరియు పాలక వర్గం సభ్యులు మాట్లాడుతూ…
*అడగగానే గొప్ప మనసుతో స్పందించి మినరల్ వాటర్ ప్లాంట్ మరియు బోర్ మోటర్ ఏర్పాటు చేస్తున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ,ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకొని అయరారోగ్యాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో…
దేవాలయ పాలకమండలి చైర్మన్ సత్య నారాయణ రెడ్డి, ఈ.వో సత్య చంద్రారెడ్డి,ఊరుకొండ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్యాప నిఖిల్ రెడ్డి,పిఎసిఎస్ మాజీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి,అయూబ్ పాషా,రమేష్ నాయక్,అబ్దుల్ సమీ,గోపి,శ్రీనివాసులు,యూత్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, వహీదోద్దీన్,మనోహర్ రెడ్డి, ఆరిఫ్,పాలకమండలి సభ్యులు ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ ,మహేష్, మాజీ ప్రజా ప్రతినిధులుతదితరులు పాల్గొన్నారు.