SAKSHITHA NEWS

[18:49, 31/08/2024] SAKSHITHA NEWS: చేనేత వస్త్రాలను కొనుగోలు చెయ్యండి.. వారిని ప్రోత్సహించండి
-హస్తకళల అభివృద్ధికి, చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం రాయితీలను అందిస్తోంది
-ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నగరం లో చేనేత జౌళి ప్రదర్శన
-శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఫంక్షన్ హాల్‌లో హస్తకళలు, కళాత్మక వస్త్రాల ప్రదర్శన

  • కలెక్టర్ పి. ప్రశాంతి
    సాక్షిత రాజమహేంద్రవరం :

వివిధ ప్రాంతాల నుండి హస్తకళాకారులు, నేత కార్మికుల కళాత్మకంగా తయారు చేసే ఉత్పత్తులు  వినియోగదారులకు అందించే క్రమంలో గాంధీ శిల్ప బజార్ వేదికను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక జాంపేట  శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ నందు హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న హస్తకళలు, కళాత్మక వస్త్రాల విక్రయ ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించి, వివిధ స్టాల్ల్స్ సందర్శించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, రాష్ట్ర హస్త కళాకారుల సంస్ధ ఈ డీ – ఎమ్. విశ్వ , అసిస్టంట్ డైరెక్టర్ ఎన్.అపర్ణ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హస్తకళల అభివృద్ధికి, చేతివృత్తులు, చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ రాయితీలను అందిస్తుందన్నారు. భారత ప్రభుత్వం సహకారంతో వినియోగదారుల అభిరుచికి అనుకూలంగా ఉత్పత్తులను తయారుచేసి ఇటువంటి వేదికల ద్వారా ప్రదర్శించడం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం నగర ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ ఈ సందర్శించి ఇక్కడ ప్రదర్శించిన కళాత్మకమైన ఉత్పత్తులు డార్మెట్స్, హౌస్ డెకరేషన్ మెటీరియల్, హ్యాండ్ బ్యాగ్స్ మరియు వివిధ రకాల డిజైన్ శారీలను కొనుగోలు చేయడం ద్వారా చేతివృత్తుల ఉత్పత్తిదారులకు ప్రోత్సాహాన్ని అందించినవారు అవుతారన్నారు. కళకు వెల కట్టలేమని ఈ ప్రదర్శనలో పెట్టిన ప్రతి వస్తువు కళాత్మకతగా వున్న ఉత్పత్తులని నగర ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ ను తిలకించి హస్తకళల అభివృద్ధికి, గుర్తింపు తగిన ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు.


సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం హస్తకళలు, చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ వారి ప్రతిభకు గుర్తింపుగా హ్యాండ్ క్రాఫ్ట్ డిపార్ట్మెంట్ ఇటువంటి ప్రదర్శనలు వారి విశిష్టతను తెలిపే విధంగా ఇవ్వడం శుభ పరిమాణం అన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని పౌరులకు తమ హస్త కళాకారులు, చేనేత కార్మికులు తయారు ఉత్పత్తులను విక్రయించడానికి ఈ ఎగ్జిబిషన్ చక్కని వేదికని, నగర ప్రజలందరూ ఈ చెప్పిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హస్త కళలు, చేనేత ఉత్పత్తులు అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమ్.విశ్వ మాట్లాడుతూ గాంధీ శిల్ప బజార్ను డెవలప్మెంట్ కమీషనర్ (హస్తకళలు), DC(H) కార్యాలయం, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ స్పాన్సర్ చేస్తుందన్నారు. ఈ గాంధీ శిల్ప బజార్ 30 ఆగస్టు నుండి 5 సెప్టెంబర్ 2024 వరకు ఆదివారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాలతో సహా 7 రోజులు ప్రతిరోజు ఉదయం 11:00 గంటల నుండి రాత్రి 9:00 వరకు ప్రజలకు తెరిచి ఉంటుందన్నారు.

భారతదేశం నలుమూలల నుండి దాదాపు 50 మంది హస్తకళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొనడం జరుగు తుందన్నారు. ఇక్కడ వారు వివిధ రకాల హస్తకళలు మరియు చేనేత ఉత్పత్తు లను ప్రదర్శిస్తారని, ఈ ఏడాది జరిగే కార్యక్రమంలో కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, చెక్కబొమ్మలు, తోలు బొమ్మలు, మచిలీపట్నం నుంచి కృత్రిమ ఆభరణాలు, మదనపల్లి నుంచి కుండలు, ఏలూరు నుంచి తివాచీలు, నర్సాపూర్ జరీ వస్తువులు, మచిలీపట్నం, వెంకట్సగిరి, మంగళగిరి నుంచి కలంకారి బ్లాక్ ప్రింట్లు ఉంటాయి. ఉప్పాడ చీరలు, బీహార్ నుండి బగల్పూర్ సిల్క్, మధ్య ప్రదేశ్ నుండి కోసా చీరలు, కాశ్మీరి సిల్క్ మరియు బెంగాల్ కాటన్లు, ఆంధ్ర ప్రదేశ్ మరియు భారతదేశంలో గల వివిధ ప్రాంతాల నుండి హస్తకళాకారులు, నేత కార్మికులు మరియు తయారీదారులు గాంధీ శిల్ప బజార్లో తమ కళాత్మక హస్తకళలు మరియు వస్త్రాలను ప్రదర్శించడంతో పాటు వినియోగదారులకు విక్రయించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.


SAKSHITHA NEWS