విద్యతో పాటు ఉపాధి నైపుణ్య శిక్షణ
ఓపెన్ వర్సిటీ డైరెక్టర్ వై- వెంకటేశ్వర్లు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ విద్యార్థులకు విద్యతోపాటు ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు పొందటానికి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గంట చక్రపాణి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం లోని ఎస్ వి డిగ్రీ కళాశాల సార్వత్రిక అధ్యయన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ తో అవగాహన ఒప్పందం ప్రకారం విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్స్ జిఎస్టి అసిస్టెంట్ ఎకౌంటు సోలార్ టెక్నీషియన్ సిసి కెమెరాల వంటి విభాగాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. అదేవిధంగా మహిళ విద్యార్థులకు టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని బీఎస్సీ ఎంపీసీ బీ జెడ్ సి బీకాం కంప్యూటర్ విద్యార్థులకు సైన్స్ ప్రాక్టికల్స్ కేంద్రాన్ని ఈ సంవత్సరం నుండి ఎస్వి కళాశాల సార్వత్రిక అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు .
కోయ ,చెంచు ఆదివాసి గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు .పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అనుభవజ్ఞులైన సీనియర్ ప్రొఫెసర్ల చే స్టడీ మెటీరియల్ తయారు చేసి విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు . ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్ పొందడానికి ఆగస్టు 7 చివరి తేదీ అని ఇతర వివరాల కోసం బిఆర్ఏఓయు ఆన్లైన్ డాట్ ఇన్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని ఇతర వివరాల కోసం ఎస్వీ కళాశాల స్టడీ సెంటర్ ను సంప్రదించాలని తెలిపారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ ప్రొఫెసర్ వి వెంకటేషులు మాట్లాడుతూ ప్రాక్టికల్స్ పరీక్షల నిమిత్తం నల్లగొండ పట్టణానికి వెళ్ళుటకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కళాశాల సార్వత్రిక కేంద్రంలో ప్రాక్టికల్స్ సెంటర్ ను ఏర్పాటు చేయడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కిషోర్ రెడ్డి ,డాక్టర్ అనిల్, మల్లయ్య, సార్వత్రిక అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి, క్లర్క్ ప్రసాద్ కౌన్సిలర్లు బుక్క ఉపేందర్ వడ్డానం శ్రీనివాస్ మధు సుఖేష్ తదితరులు పాల్గొన్నారు

