సూర్యాపేటలో వాహనాల వేలం నిర్వహణకు ఏర్పాట్లు

Sakshitha news

సూర్యాపేటలో వాహనాల వేలం నిర్వహణకు ఏర్పాట్లు

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి

సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన వాహనాల వేలం ఈనెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఎక్సైజ్ స్టేషన్‌లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వేలాన్ని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్. లక్ష్మా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనదలచిన అభ్యర్థులు అదే రోజు ఉదయం 9 గంటల నుండి స్టేషన్‌కు వచ్చి ముందస్తుగా దరఖాస్తు రుసుము చెల్లించి తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వేలంలో మొత్తం 6 వాహనాలు ఉండగా, వాటిలో ఒకటి టీవీఎస్ ఎక్స్‌ఎల్, నాలుగు ద్విచక్ర వాహనాలు (బైక్స్), ఒక త్రిచక్ర వాహనం (ఆటో) ఉన్నాయి. ఆసక్తి గల వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

Scroll to Top