జనగామ డివిజన్‌ను వన్‌టౌన్‌లో విలీనం చేయడం ప్రజల చిరకాల కోరిక నెరవేర్పు…
— సిపిఐ…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆరవ డివిజన్ జనగామతో పాటు మరికొన్ని ప్రాంతాలను గోదావరిఖని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఈ ప్రక్రియ కోసం కృషి చేసిన రామగుండం పోలీస్ కమిషనర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, జనగామను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకురావాలని గత కొన్ని సంవత్సరాలుగా సిపిఐ తరఫున గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
జనగామ డివిజన్ ప్రజలకు ఈ విలీనం వల్ల పరిపాలనా పరంగా, పోలీసు సేవల పరంగా మరింత సౌలభ్యం కలుగుతుందని ఆయన అన్నారు.
ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఐ హర్షిస్తూ స్వాగతిస్తోందని తెలిపారు.

