స్వీప్ నోడల్ అధికారి, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ను అభినందించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు

Spread the love

కలెక్టరేటులో ఏర్పాటు చేసిన స్వీప్ ఫోటో ప్రదర్శనను స్టాల్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తపర్చిన ఎన్నికల అధికారులు

కరచాలనంతో స్వీప్ నోడల్ ఆఫీసర్, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ కు ప్రశంసలు

ఏలూరు: జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలను ఎన్నికల వ్యయ పరిశీలకులు పి. కీర్తి నారాయణ, మెహెరామ్ గౌరవ్ మధుకర్, షేరింగ్ జోర్దన్ భూటియ క్షుణ్ణంగా పరిశీలించారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల వ్యయంఫై జిల్లా నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి & స్వీప్ నోడల్ అధికసారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ గత డబ్భై రోజుల నుంచి జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలఫై నివేదిక సమర్పించారు. అనంతరం స్వీప్ కార్యక్రమాలుఫై ఏర్పాటు చేసిన దృశ్య ప్రదర్శన స్టాల్ ను ఎన్నికల వ్యయ పరిశీలకుల బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. సందర్బంగా డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అధికారులకు వివరిస్తూ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ శాతం పెంచడానికి, ఏథికల్ ఓటింగ్ జరుపడానికి సుమారు 2200 ఓటర్ చైతన్య కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చేపట్టడం జరిగిందని అన్నారు.

ఇప్పటికే అనేక వర్గాల వారిని సమావేశ పర్చి అవగాహన సదస్సులు, మానవహారాలు, ర్యాలీలు, ముఖాముఖీ కార్యక్రమాలు నిర్వహించామని బృందం దృష్టికి డీపీఓ తీసుకొచ్చారు. ‘అమ్మ పిలుస్తుంది’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా దూరప్రాంతంలో ఉన్న ఓటర్లకు జిల్లా యంత్రంగం ఓటర్ల స్లిప్స్ తో పాటు ఆహ్వాన పత్రిక పంపి పోలింగ్ రోజు ఓటర్లను పిలిపించి ఓటింగులో భాగస్వామ్యం చేయడం జరుగుతుందని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలు బాగున్నాయని పోలింగ్ శాతం పెంచడానికి స్వీప్ నోడల్ ఆఫీసర్, డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ చేస్తున్న కృషిని ఎన్నికల ఎక్సపెండిచర్ ఆబ్జెర్వర్స్ అధికారుల సమీక్షా సమావేశంలో అభినందించారు.

Related Posts

You cannot copy content of this page