SAKSHITHA NEWS

తిరుపతి నగరంలో అనాధికారిక నిర్మాణాలను ముందే గుర్తించి నోటీసులు ఇచ్చి నిర్మాణాలను ఆపాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అనుమతులు లేని భవన నిర్మాణాలు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది గుర్తించి నోటీసులు జారీ చేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో పెండింగ్ లో వున్న టి.డి.ఆర్. బాండ్లు త్వరగా అందజేయాలన్నారు. అదేవిధంగా నగరంలో ఫుట్ పాత్ ల ఆక్రమణలను వెంటనే తొలగించాలని, ట్రేడ్ లైసెన్సు లను రెనెవ్యుల్ చేయించడం, కొత్త దుఖాణాలకు ట్రేడ్ లైసెన్సు లు తీసుకునేల తగు చర్యలు చేపట్టాలన్నారు. అడ్వర్టైజింగ్ బాకాయిలపై దృష్టి సారించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటి ప్లానర్ బాల సుబ్రహ్మణ్యం, టి.పీ.ఓ.లు, ప్లానింగ్ విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS