SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా సాక్షిత న్యూస్ రూరల్ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ని గంగారాం మేకల గండిలో గత రెండు రోజులుగా తగులబడుతున్న డంపింగ్ యార్డ్…
ఈ విషయం లో స్థానికులు మొదటి రోజు మున్సిపల్ సిబ్బందికి సమాచారం తెలియచేసిన నామమాత్రంగా వాటిని ఆర్పే ప్రయత్నం చేసి వెనుతిరిగిన మున్సిపల్ & ఫైర్ సిబ్బంది….
డంపింగ్ యార్డ్ అంటుకోవటం వళ్ళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఈ కాలంలో పశువులకు ఉండే పశు గ్రాసం కూడా పూర్తిగా దగ్దామయ్యిందని చుట్టూ పక్కల పంట పొలాల రైతులు వాపోతున్నారు….
ఇప్పటికైనా మున్సిపల్ మరియు ఫైర్ శాఖ సిబ్బంది స్పందించి డంపింగ్ యార్డ్ మంటలను ఆర్పేలా చర్యలు తీసుకోవాలి అని వారు సాక్షిత న్యూస్ కి తెలిపారు
✍️…. సాక్షిత న్యూస్ వికారాబాద్ రూరల్ రిపోర్టర్ ల్యగల శివ

Whatsapp Image 2024 01 10 At 2.25.05 Pm