SAKSHITHA NEWS

మహిళా ఉపాధ్యాయినిలకు సముచిత గౌరవం

సావిత్రిబాయి పూలే జయంతి జనవరి 3వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించిన తెలంగాణ సర్కార్

మహిళా ఉపాధ్యాయినిలను సన్మానించి గౌరవించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

సాక్షిత వనపర్తి
తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఉపాధ్యాయినిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని, జనవరి 3న నిర్వహించే సావిత్రిబాయ్ పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు_

పట్టణంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కాంప్లెక్స్ లెవెల్ TLM కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు

ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

అనంతరం ఆయన మాట్లాడుతూ….

అణగారిన వర్గాల బతుకులు మార్చిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ఆయన అన్నారు

భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలుగా మహిళ లోకానికి ఎన్నో గొప్ప సేవలందించిన త్యాగమూర్తి సావిత్రిబాయి పూలే అని ఎమ్మెల్యే పేర్కొన్నారు

మహిళా ఉపాధ్యాయినిలను మ్మెల్యే శాలువాలతో సన్మానించారు

వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన ప్రదర్శనను ఆయన సందర్శించి తిలకించి విద్యార్థులతో మాట్లాడారు

విద్యార్థులు అందరూ చదువుతోపాటు ఆటపాటలపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన సూచించారు

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు టై బెల్టుల ను అందజేశారు

కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని,పట్టణ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కౌన్సిలర్లు, జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు మహిళా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS