మోకిలలో ఘనంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

మోకిలలో ఘనంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

SAKSHITHA NEWS

మోకిలలో ఘనంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

శంకర్‌పల్లి: జూన్ 23:
శంకర్‌పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామంలో ఆదివారం ఘనంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్ హాజరై శ్యాంప్రసాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాములు గౌడ్ మాట్లాడుతూ అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించిన భరతమాత ముద్దుబిడ్డ, జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేష్, శశికాంత్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నాయకులు వీరేందర్, హర్షవర్ధన్ నాయక్ ఉన్నారు

WhatsApp Image 2024 06 23 at 13.32.19

SAKSHITHA NEWS