SAKSHITHA NEWS

” వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ “కు డా. కొప్పుల విజయ్ కుమార్ ఎంపిక

శంకర్‌పల్లి: ఆగస్టు 29: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కు సోషియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్ ఎంపిక అయ్యారు. ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ రియాలిటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ, న్యూఢిల్లీ వారి ద్వారా సెప్టెంబర్ 14 న బెంగళూరులో నిర్వహించే కార్యక్రమంలో ” వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ” తీసుకోవడానికి లెటర్ వచ్చిందన్నారు. తాను చేసిన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, న్యాయ సేవా కార్యక్రమాలు చేసినందుకు గుర్తించి 16 దేశాల కమిటీ సభ్యుల ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఇంతటి గొప్ప అవార్డు పొందే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మనము చేసే మంచి పనులే మనకు మార్గదర్శకాలు అని అన్నారు. ఈ అవకాశం రావడానికి సహకరించిన న్యాయ విభాగం మిత్రులకు, అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.


SAKSHITHA NEWS