ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…
సాక్షిత : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రారంభించారు. ఈ మేరకు గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో చేనేత, పవర్ లూమ్ కార్మికుల ద్వారా తయారు చేయించిన జాతీయ జెండాలను ఎమ్మెల్యే పంపిణీ చేసి జెండాలు అందినట్లు గుర్తుగా ఇంటికి స్టిక్కర్ అతికించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా, తమ విధిగా భావిస్తూ దేశం పట్ల ఉన్న గౌరవాన్ని చాటిచెప్పే విధంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓహెచ్ ప్రశాంతి, ఏఈ అరుణ్, ఎస్ఎస్ పోతారెడ్డి మరియు సీనియర్ నాయకులు రషీద్ బైగ్, ఏజిపి కమలాకర్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, వీరయ్య చౌదరీ, బాల్ రెడ్డి, ఆంజనేయులు, యాదగిరి, సత్యారావు, సుమన్, సత్యనారాయణ, శంకర్ శాస్త్రి, ఇమ్రాన్ బైగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…