దూలపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి, శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి దేవస్థాన రాజగోపురం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి లో శ్రీ సీతారామ చంద్ర స్వామి శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన రాజగోపురం ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవారాధనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బూర్గుబావి హనుమంతరావు, బూర్గుబావి సత్యనారాయణ, బి శివకుమార్, డప్పు నరేందర్ ఆలయ కమిటీ సభ్యులు స్థానిక నాయకులు ప్రజలు భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ కుల సంఘాల పెద్దలు కార్తీక మాస కార్తీకమాస మన భోజన మహోత్సవానికి ఆహ్వానాలు అందజేశారు
దూలపల్లి శ్రీ సీతారామ చంద్ర స్వామి, శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…