SAKSHITHA NEWS

యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకో వద్ద నీ కోరిన…… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

సాక్షీత వనపర్తి జూన్ 26
వనపర్తి జిల్లా లో
మాదక ద్రవ్యాల బారిన పడి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.


జూన్ 26న ప్రపంచ మాదక ద్రవ్యాలు, అక్రమ రవాణా దినోత్సవాన్ని పోలీస్, జిల్లా సంక్షేమ దాఖలు సంయుక్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ ర్యాలీలో జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణ మూర్తి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆర్ లోక్ నాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాలను ఒక్కసారి వాడి చూద్దామని ఒక్కసారి వాడటం వల్ల బానిస అయిపోనని అనుకొని మొదటిసారి వాడతారన్నారు.

ఆ ఒక్కసారి అని చేసిన మొదటి తప్పుకే యువత కాలక్రమేణా బానిసలై తన జీవితం తో పాటు తనపై ఆధార పడి ఉన్న కుటుంబ సభ్యుల జీవితాలు ఛిద్రం అయిపోతాయని పేర్కొన్నారు.

అందుకే యువత ఆ ఒక్కసారి కూడా సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, గంజాయి వంటి వాటి జోలికి పోవద్దని పిలుపునిచ్చారు.

యువత గొప్ప కలలు కానీ వాటి సాకారానికి పాటు పడాలని కోరారు.

జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఎక్కడైనా మత్తు పదార్థాలు వాడినట్లు తెలిసిన, ఉత్పత్తి చేసిన పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు .


జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణ మూర్తి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల వాడకం నుండి దూరంగా ఉండాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులు తమ పై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా చెడు అలవాట్లకు గురి కావద్దన్నారు.

ఎవరైనా తమ ఇంట్లో కాని స్నేహితులు కానీ చెడు అలవాట్లకు గురి అవుతుంటే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేశారు.

యువత తమ భవిష్యత్తుతో పాటు తల్లిదండ్రుల జీవితాల్లో పెను విషాదాన్ని నింపుతాయి అనే నిజాన్ని మరచిపోవద్దని హితవు పలికారు.

మాదక ద్రవ్యాల ఫ్రీ జిల్లాగా వనపర్తి నీ తీర్చిదిద్దాలని తద్వారా రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు.


జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోక్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగినది మన భారత దేశమని అందువల్ల యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

భారత దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు యువత చేతుల్లో ఉందన్నారు.

అందుకే యువత బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి తప్ప ఎప్పటికీ మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని సూచించారు.


అంతకు ముందు జిల్లా సాంస్కృతిక శాఖ కళాకారులు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను తమ పాటల రూపంలో వినిపించి ఆకట్టుకున్నారు.

అనంతరం బాలుర కళాశాల మైదానం నుండి పాలిటెక్నిక్ కళాశాల వరకు సాగిన విద్యార్థుల భారీ ర్యాలిని కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు.


అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, అదనపు ఎస్పీ తేజావ రామదాసు, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీ, ఇతర జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకో వద్ద

SAKSHITHA NEWS