SAKSHITHA NEWS

Don’t fall into the temptation of sub inspector constable recruitment

సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నియామకాల్లో ప్రలోభాలకు లోను కావద్దు

అభ్యర్థులకు కృష్ణా జిల్లా ఎస్పీ పి. జాషువా ఐపిఎస్ హితవు

ప్రస్తుతం జరుగుతున్న సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్స్ నియామకాల్లో ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకూడదనీ, నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి.జాషువా ఐపిఎస్ తెలియచేసారు. ఏ విధమైన సిఫారసులు ఒత్తిడులూ, ఆర్ధికపరమైన అవనియామకకతవకలకు తావు లేకుండా నియామకం ఖచ్చితంగా జరుగుతుంది అని, అభ్యర్థులను ఎవరైనా రికమండేషన్లు, లంచం ద్వారా నియామకం ఇప్పిస్తామంటూ సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దని హితవుపలికారు.


రాత పరీక్షలకు సిలబస్ కు అనుగుణంగా కష్టపడి చదువుకోవాలనీ, దేహదారుఢ్య పరీక్షలకు కూడా తగురీతిన ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు సంపొదించుకొని ఉద్యోగం సంపాదించుకోవాలనీ సూచించారు.
ఏధమైన దళారీలు , ఇతర శక్తుల ప్రమేయం లేకుండా నియామకం జరిగుతుంది. కావున, ఎవరైనా అభ్యర్ధులను ప్రలోభాలకు గురి చేయుటకు ప్రయత్నించినచో సదరు విషయాన్ని పోలీసువారి దృష్టికి తక్షణమే తీసుకురావాలని సూచించారు.


ఇటువంటి సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతూ, సదరు మోసగాళ్ళపై చట్టటరీత్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.


SAKSHITHA NEWS