పెద్ద మనసు చాటుకున్న దాతలు
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లా కేంద్రం లో గల స్థానిక 27వ వార్డ్ లో పక్షవాతం తో బాధపడుతున్న అలీ కుటుంబ పరిస్థితినీ ఎస్ ఎన్ ఫౌండేషన్ సభ్యులు చిరివెళ్ళ శబరి సూర్యాపేట బ్లడ్ సోల్జర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు నసీర్ కి వివరించగా స్పందించిన మాజీ జెడ్పీ చైర్మెన్ గుజ్జ దీపికా యుగంధర్ దంపతుల కుమార్తెలు గుజ్జ తనిష్క రావు,గుజ్జ జోసిక రావు ఒక నెలకి సరిపడా కిరణా సామాను,బియ్యం అందించటం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యుడు మాట్లాడుతూ సహకరించిన ప్రసాద్ కి ప్రత్యేక ధాన్యవధములు. చిన్న వయసులో ఒకరి బాధ ను అర్థం చేసుకొని,స్పందించి వితరణ చేయటం సంతోషము గా వుంది అని ఇలా ప్రతి ఒక్కరు స్పందించాలి అని కోరారు.ఈ కార్యక్రమం లో సూర్యాపేట బ్లడ్ సోల్జర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు నసీర్ బాబా, యన్నమల్ల ప్రశాంత్ యాసీన్ తదితరులు పాల్గోన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
