జర్నలిస్టు జర్నీ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికను విడుదల చేసిన కలెక్టర్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: జర్నలిస్ట్ జర్నీ దినపత్రిక అందరి మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గల ఆయన చాంబర్లో పత్రికను విడుదల చేసి మాట్లాడారు. సందర్భంగా పత్రిక యాజమాన్యం వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి,పత్రిక సీఈవో ఎడిటర్ ధూపాటి శ్యాంబాబు,తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్, అసోసియేషన్ ఆత్మకూర్ (ఎస్) అధ్యక్షుడు కొండ రవి తదితరులు పాల్గొన్నారు
