124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బందితో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీ మరియు జన్మభూమి కాలనీలలో ప్లకార్డులు పట్టుకుని పాదయాత్ర చేయడం జరిగింది. ఇంటింటికి వెళ్లి డ్రమ్ములలో నిల్వ ఉన్న నీటిలో దోమల మందు పిచికారీ చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతు నిల్వ ఉన్న నీటి వల్ల దోమలు ప్రభలించి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక మహిళ తమ పిల్లలని అంగన్వాడీ కేంద్రంలో చేర్చుకోవడంలేదని కార్పొరేటర్ గారితో తెలుపగా, వెంటనే జన్మభూమి కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, పిల్లలను ఆప్యాయంగా పలకరించి, సిబ్బందితో మాట్లాడడం జరిగింది. బాలబాలికలను మరియు గర్భవతులను ప్రతిఒక్కరి పేరు నమోదు చేసుకుని పౌష్టికాహారం అందించాలని అలాగే వచ్చినవారితో ప్రేమగా మాటడాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, నరసింహులు, సిద్దయ్య, జగదీష్, వెంకటేష్, యాదగిరి, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, రాములుగౌడ్, కటికరవి, అర్వరవి, సంతోష్, రవీందర్, మారుతి, కూర్మయ్య, ఎంటమాలజి సూపర్వైజర్ నరసింహులు మరియు ఎంటమాలజి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దొడ్ల వెంకటేష్ గౌడ్ దోమల నివారణ పట్ల ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చేందుకు జి.ఎచ్.ఎం.సి ఎంటమాలజీ సిబ్బంది
Related Posts
బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
SAKSHITHA NEWS బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలికొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్…
రైతులకు సంకెళ్ళా
SAKSHITHA NEWS రైతులకు సంకెళ్ళా…? -ప్రభుత్వం వెంటనే రైతులను విడుదల చేయాలి.. -ప్రగతి నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు &నేతలు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు…