లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు, చట్ట విరుద్ధంగా అబార్షన్లు చేయొద్దు

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు, చట్ట విరుద్ధంగా అబార్షన్లు చేయొద్దు

SAKSHITHA NEWS

Strict measures should be taken if gender determination tests are done and abortions should not be done against the law

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు, చట్ట విరుద్ధంగా అబార్షన్లు చేయొద్దు: అదనపు కలెక్టర్ రెవిన్యూ బి. ఎస్.లత .
……………………………………………………….

సాక్షిత సూర్యాపేట జిల్లా ప్రతినిధి : జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్లు నిర్వహించినట్లయితే చట్ట పరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీమతి బి.ఎస్.లత హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ సమన్వయంతో నిర్వహించిన గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియలింగ నిషేధ చట్టం1994PCPNDT, ఎంటిపి గర్భ స్రావ నిషేధ చట్టం పై ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ, ఈ రెండు చట్టాలు క్షేత్రస్థాయిలో అమలుపరచాలని, జిల్లాలో ఆడపిల్లల సంఖ్య ఆందోళన కలిగిస్తుందని, అందుకు ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కి అవగాహన కల్పించి, ఆడపిల్లల ప్రాముఖ్యత, ప్రాధాన్యత, రాబోయే తరాలకు వారి యొక్క లోటు సమస్యలకు దారితీస్తుందని, స్త్రీ పురుష నిష్పత్తిలో అసమానతలు ఏర్పడతాయని, ఆడైనా మగైనా ఒకే విధంగా చూడాలని, వారికి విద్యాబుద్ధులు సమానంగా నేర్పించాలని, నేడు ఆడపిల్లలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, అల్ట్రా సౌండ్ స్కానింగ్ ల ద్వారా ఆడమగా తెలుసుకోవద్దని, చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించినారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని శ్రీమతి జ్యోతి పద్మ అంగన్వాడీ ఉపాధ్యాయులు అందరూ గర్భిణీ స్త్రీలకు సరైన పరీక్షలు చేసి ,వారి యొక్క పోషణ స్థితిని పెంచి, సుఖప్రసవాలు జరిగేటట్లు చూడాలని, ఈ కార్యక్రమంలో గర్భస్రావం నిషేధ చట్టంపై డాక్టర్ జై శ్యామ్ సుందర్ ప్రోగ్రాం అధికారి వివరించినారు. చట్ట విరుద్ధంగా అబార్షన్లు చేయొద్దని, అందుకు తగు నిబంధనలు ఉన్నాయని, నైపుణ్యత ఉన్న డాక్టర్ల చేత, డాక్టర్లు నిర్ణయించిన ప్రకారం చేసుకోవాలని తెలిపినారు. పి సి పిన్ డి టి చట్టంపై మీడియా విస్తరణ అధికారి అంజయ్య గౌడ్ అవగాహన కల్పించినారు. శ్రీమతి చైతన్య సంకల్ప హబ్ కార్యక్రమ కోఆర్డినేటర్ గా వ్యవహరించినారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు సూపర్వైజర్లు సిడిపివోలు పాల్గొనినారు.


SAKSHITHA NEWS