మల్కాజిగిరి జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి ఉడత భక్తిగా ఏ డి సి నరసింహ, మహమ్మద్ రషీద్, శ్రీను, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సంవత్సరం పాటు ఉచిత బస్ పాస్ లను పాఠశాల ప్రిన్సిపల్ విల్లియమ్స్ సమక్షంలో రాణిగంజ్ డిపో మేనేజర్ శ్రీధర్ చేతుల మీదగా 100 మంది విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాణిగంజ్ డి ఎం శ్రీధర్ మాట్లాడుతూ, కొంతమంది పేద విద్యార్థులు రవాణా సౌకర్యం లేక మధ్యలోనే చదువు మానేస్తున్నారని, అలాంటి విద్యార్థులకు చేయూతనివ్వడానికి తమ సిబ్బంది విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను అందజేయాలని మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన తమ సిబ్బందిని అభినందించారు. విద్యార్థులు బస్సులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ విలియంస్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు బస్సు పాసులు అందజేసిన రాణిగంజ్ డిపో మేనేజర్ శ్రీధర్, వారి సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో రాణిగంజ్ డిఎం శ్రీధర్, ఎడిసి నరసింహ, మహమ్మద్ రషీద్, శ్రీను, ధర్మేందర్, కండక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను పంపిణీ చేసిన డి ఎం శ్రీధర్
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…