మక్తల్ పట్టణంలోని అతి పురాతనమైన మల్లికార్జున స్వామి దేవాలయాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కొండయ్య మున్సిపల్ చైర్మన్ పావని, వైస్ చైర్మన్ అఖిల, ఎంపీటీసీ బలరాం రెడ్డి.కౌన్సిలర్ ప్రసన్న ఆలయాన్ని శుభ్రపరచారు.
ఈ నేల 22 తారీకు రోజు అయోధ్యలో రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలను శుద్ధి చేయాలని, విగ్రహ ప్రతిష్ట జరిగేవరకు నిత్య నైవేద్యం పూజలు భజనలు జరగాలని ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన పిలుపు మేరకు మల్లికార్జున దేవాలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరిపి విగ్రహ ప్రతిష్టాపనను జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగానే దేశంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి రాముని అక్షింతలు చేరవేయడం జరిగిందని.. ఈ నెల 22న ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు తమ ఇంట్లో ఐదు దీపాలు వెలిగించి తమ రామభక్తుని చాటుకోవాలని డీకే అరుణ అన్నారు.