ఉత్తమ సేవలకు జిల్లాస్థాయి అవార్డులు..

Spread the love

అంబేద్కర్ కోనసీమ జిల్లా

ఉత్తమ సేవలకు జిల్లాస్థాయి అవార్డులు..

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని 9 ప్రధాన అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఆలమూరు మండలంలోని బడుగువానిలంక,నవాబుపేట గ్రామ పంచాయతీలను జిల్లాస్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే సోమవారం అమలాపురం కలెక్టర్ వారి కార్యాలయంలో ఉత్తమ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీగా బడుగువానిలంక గ్రామం ఎంపిక కావడంతో సర్పంచ్ దూలం వెంకటలక్ష్మి సత్తిబాబు,పంచాయతీ కార్యదర్శి యు.సుప్రియ, అలాగే ఉత్తమ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీగా నవాబుపేట గ్రామం ఎంపిక కావడంతో సర్పంచ్ సూరంపూడి ముత్యాలమ్మ,పంచాయతీ కార్యదర్శి జాజుల అయ్యన్నలు కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షుక్ల చేతుల మీదుగా ఈ పురస్కారాలను, బహుమతులను వారు అందుకున్నారు.ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు.

Related Posts

You cannot copy content of this page