గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మిట్టపల్లి, మల్సూర్ తాండ గ్రామాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రస్తుతం త్రాగునీటి సరఫరా, బోర్లు, ఓపెన్ బావులు, నీటి వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. త్రాగునీటి విషయమై క్రొత్త బోర్లు, పైప్ లైన్, మోటార్ల మరమ్మతులు తదితరాలు వెంటనే పూర్తి చేయాలన్నారు. త్రాగునీటి సరఫరాలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. బోరుబావులు, పాత త్రాగునీటి వనరులు పునరుద్ధరించాలన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ సందర్భంగా పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, తల్లాడ తహసీల్దార్ రవికుమార్, ఎంపిడివో చంద్రమౌళి, ఇర్రిగేషన్ డిఇ శ్రీనివాసరావు, అధికారులు తదితరులు ఉన్నారు.