Distribution of Kalyana Lakshmi cheques.
సాక్షిత : నస్పూర్ మున్సిపాలిటీ కి చెందిన 64 మంది 64,07,424/- లక్షల కళ్యాణ లక్ష్మీ చెక్కులు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి క్లబ్ లో * మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ ఆడపిల్లల తల్లికే కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులు, ఇస్తున్నాం పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకుడదన్న ఉద్దేశ్యం తోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదలకు అండగా నిలిచారు…
అలాగే కాన్పు సమయంలో అంగన్ వాడీల ద్వారా పాలు, గుడ్లు, మంచి భోజనాన్ని గర్భిణీ స్త్రీలకు పోషకాహార రూపంలో అందజేస్తున్నాం ప్రసవసమయంలో ప్రభుత్వాసుపత్రికి తెస్తే పన్నెండు వేల రూపాయలు, కేసీఆర్ కిట్ పంపిణీ చేయడం జరుగుతుంది.ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్,వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్,పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య,పార్టీ ముఖ్యనాయకులు,పట్టణ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.