రామ్ కి ఫౌండేషన్ వితరణ.
పరవాడ ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్నం భోజన పథకానికి వంట పాత్రల పంపిణీ.
పరవాడ గ్రామంలో ఉన్న స్థానిక ప్రభుత్వ బాల, బాలికల పాఠశాలకు రామ్ కీ ఫౌండేషన్ వారు వంట పాత్రలు , స్టవ్, మిక్సర్ మరియు కుక్కర్ ను అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గిరిధర్ బక్షి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదువుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిరోహించారని, పరవాడ పాఠశాలలో విద్యార్థులు కూడా కష్టపడి చదివి అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని చెప్పారు. రామ్ కీ ఫౌండేషన్ డిప్యూటీ హెడ్ డాక్టర్ కే శ్రీకాంత్ గారు మాట్లాడుతూ రామ్ కి ఫౌండేషన్ సి ఎస్ ఆర్ ద్వారా ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల స్కూళ్లలో అవసరమగు మౌలిక సదుపాయాల కొరకు రామ్ కీ ఫౌండేషన్ కృషి చేస్తుందని, గతంలో కూడా పరవాడ స్కూలులో సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం జరిగింది. ప్రస్తుతం పరవాడ స్కూలుకు కంప్యూటర్ ల్యాబ్ మంజూరు చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి చుక్క ఉమా మాట్లాడుతూ వంట పాత్రలు అందజేసినందుకు రామ్ కీ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయులు బొడ్డ అప్పలనాయుడు మరియు ఇతర అధ్యాపకులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగినది.