కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ :
కారుణ్య వెల్ఫేర్ సొసైటీ నిజాంపేట కార్యాలయంలో అడ్డా కూలీలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి వ్యవస్థాపకులు, బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసి నాగరాజు పాల్గొని.. నిత్యాసర వస్తువులను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా దాసి నాగరాజు మాట్లాడుతూ వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా.. రోజువారి కూలి చేసుకునే వారి ఇబ్బందులు.. గమనించి వారికి ఈ విధంగా సరుకులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాచుపల్లి బిజెపి అధ్యక్షులు ప్రసాద్ రాజు, కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం జోసఫ్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి సైదులు, ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు రాము, వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు హోలిస్టిక్ హాస్పిటల్ వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు నిమిత్తం జరుగుతున్న పనులను, GHMC ఇంజనీరింగ్ HMWSSB మరియు ట్రాఫిక్ అధికారులతో కలసి పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…
కేసీఆర్పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్
SAKSHITHA NEWS కేసీఆర్పై కాళేశ్వరం కమిషన్ ఫోకస్ హైదరాబాద్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఒక వైపు విచారణ.. మరోవైపు రిపోర్ట్ తయారీపై కాళేశ్వరం కమిషన్ ప్రధానంగా దృష్టిపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన విచారణపై ప్రాథమిక నివేదికను కమిషన్…